Ranya Rao: రన్యారావు కేసులో.. మరో కీలక విషయం వెలుగులోకి

దుబాయ్ నుంచి అక్రమంగా బంగార తరలిస్తూ అరెస్టయిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో ఆమె బంగారం (Gold) కొనుగోలు చేసేందుకు హవాలా డబ్బు (Hawala money ) ను వినియోగించినట్లు విచారణలో తేలింది. స్వయంగా రన్యారావు దీన్ని అంగీకరించినట్లు డీఆర్‌ఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు రన్యారావు అంగీకరించారని డీఆర్‌ఐ (DRI) తెలిపింది. నటి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా డీఆర్‌ఐ తమ విచారణలో తేలిన విషయాలను న్యాయస్థానానికి వివరించింది. కాగా అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టు (Bangalore Airport ) లో రన్యారావు అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆమెను మార్చి 3న అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ (Tarunraja) కు ఆమె ఆర్థిక సహాయం చేసినట్లు విచారణలో తేలింది.