Delhi election: అతిశీ కన్నీటిపర్యంతం.. బీజేపీ నేతలపై ఆగ్రహం..

బీజేపీ నేత రమేష్ బిధూరి(ramesh biduri) వరుస వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టడం సంగతేమో కానీ.. అధికార పార్టీకి చికాకులు తెస్తున్నారు. లేటెస్టుగా ఢిల్లీ సీఎం అతిశీపైనా అనుచితవ్యాఖ్యలు చేశారు బిధూరి. అతిశీ మర్లెనా కాస్తా మర్లెనా సింగ్ అయ్యారని.. తండ్రిని మార్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ తో కలవకూడదని కేజ్రీవాల్.. తమ వారికి చెబుతుంటారని.. ఇప్పుడు అతిశీ ఏకంగా తండ్రినే మార్చేశారన్నారు బిధూరి. ఈవ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి.
రమేష్ బిధూరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం. తన తండ్రి వృద్ధుడని, తీవ్ర అనారోగ్యంతో బాాధపడుతున్నారని.. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గెలుపుకోసం, నాలుగు ఓట్ల కోసం బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. బీజేపీ నేతల తీరుపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. మహిళా విరోధిపార్టీ బీజేపీ అంటూ ప్రచార పర్వం ప్రారంభించేశారు.
కొద్దిరోజుల ముందు ఇదే బిధూరి.. ప్రియాంక గాంధీ(priyanka gandhi)పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా స్మూత్ గాచేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనికి తోడు ఇప్పుడు అతిశీపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. బిధూరి ఇంటి దగ్గర గేటుకు మహిళా విరోధి అంటూ వ్యాఖ్యలు రాశారు. రోడ్లపై ర్యాలీ తీశారు.
అయితే ప్రియాంకపై తాను చేసివ వ్యాఖ్యలను బిధూరి సమర్థించుకున్నారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమా మాలిని చెంల వలే స్మూత్‌గా మారుస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ ఈ రోజు కాంగ్రెస్ నా ప్రకటనతో బాధపడుతుంటే, హేమమాలిని విషయంలో ఏం వారు ఏం చేశారు..? ఆమె పేరు పొందిన ఒక కథానాయిక, సినిమాల ద్వారా భారతదేశానికి కీర్తి చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యల్ని వారు ప్రశ్నించకపోతే, నా వ్యాఖ్యల్ని ఎలా ప్రశ్నిస్తారు.?’’ అని అన్నారు. హేమమాలిని మహిళ కాదా..? ప్రియాంకా గాంధీ కన్నా ఆమె ఎక్కువ ఖ్యాతిని సాధించారు అని బిధూరి అన్నారు.