అయోధ్య శిల్పికి షాక్ … వీసా నిరాకరించిన అమెరికా

అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహానిన చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్ జరుగనున్నది. అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా దీనిని నిర్వహిస్తున్నది. కర్ణాటకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ యోగిరాజ్ దరఖాస్తు చేశారు. అయితే ఆయన వీసాను తిరస్కరించినట్లు ఆగస్ట్ 10న అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడిరచలేదు.