డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లకు.. రాహుల్ గాంధీ

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి కమలా హారిస్‌లకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ రెండు వేర్వేరు లేఖలు రాశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు. ప్రజలు మెరుగైన భవిష్యత్తు కోసం మీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారు. ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగిన భారత్, అమెరికాలు చారిత్రాత్మకమైన స్నేహాన్ని పంచుకుంటున్నాయి. మీ నాయకత్వంలో ఇరు దేశాల పరస్పర సహకారం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నాను అని ట్రంప్‌నకు రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో మీ ఉత్సాహవంతమైన ప్రచారానికి నా అభినందనలు. అందరినీ ఏంక చేయాలనే మీ సందేశం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. బైడెన్ పరిపాలనలో కీలకమైన అంశాల్లో భారత్, అమెరికాలు దైపాక్షిక సహకారాన్ని మెరుగుపరుచుకున్నాయి.ఉపాధ్యక్షురాలిగా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న మీ సంకల్పం గుర్తుండిపోతుంది అని హారిస్‌కు రాహుల్ లేఖ రాశారు.