Rahul Gandhi :వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు : రాహుల్ గాంధీ

దేశ సమస్యలు తీర్చాలంటే, దేశాన్ని ఎక్స్‌రే తీయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ (AICC) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. దళితులు, ఆదివాసీలకు న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) సిద్ధంగా లేదని రాహుల్ విమర్శించారు. చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరం. నేను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా నాకు అభ్యంతరం లేదు. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్లు కేంద్రానికి పంపారు. రేవంత్ రెడ్డి పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ (Telangana) లో కులగణనను విజయవంతంగా నిర్వహించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుంది. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీకు తగిన భాగస్వామ్యం లేదు. వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ భాగస్వామ్యం అవసరం అని అన్నారు.