పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు.. ఆ సీఎంకు అనుమతి నిరాకరణ

పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్న భారత హాకీ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలపాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భావించారు. ఇందుకోసం పారిస్ పర్యటనకు అనుమతి కోరగా కేంద్రం అందుకు నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేమని చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారు. దౌత్య పాస్‌పోర్టు కలిగిన భగవంత్ మాన్ నేటి నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు పారిస్ పర్యటన చేపట్టేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కార్యాలయం కేంద్ర విదేశాంగ శాఖ ను సంప్రదించి అనుమతులు కోరింది. సీనియర్ రాజకీయ నాయకుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరి. అయితే, సీఎం మాన్‌కు జడ్ ప్లస్ భద్రత ఉండటంతో ఇంత తక్కువ సమయంలో ఆయనకు పారిస్‌లో ఆ స్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడిరచినట్లు సమాచారం. ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నారు.