padma Awards :పద్మాలు అందుకున్న ప్రముఖులు

వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకుగాను కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మపురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu ) చేతుల మీదుగా అందుకున్నారు. ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, కతక్ నృత్యకారిణి కుముదిని లఖియా తరపున మనుమడు సహాన్ హత్తంగడి, సంగీతకారిణి శారదా సిన్హా తరపున కుమారుడు అన్షుమన్‌సిన్హా (ఇద్దరికీ మరణానంతరం)లు పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ బహుభాషా నటి శోభనా చంద్రకుమార్ (Shobhana Chandrakumar) , పట్టువస్త్రాల వ్యాపార దిగ్గజం నల్లి కుప్పస్వామిచెట్టి, ఆర్థికవేత్త బిబేక్ డెబ్రాయ్ తరపున సతీమణి సుపర్ణ బెనర్జీ (మరణానంతరం), ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కైలాస్‌నాథ్ దీక్షిత్, సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు జతిన్‌గోస్వామి, మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్‌జోషి తరపున కుమారుడు ఉన్మేస్ జోషి (మరణానంతరం) ప్రముఖ నటులు అనంతనాగ్, ప్రముఖ పాత్రికేయులు, రాంబహదూర్‌రాయ్, దీదీమాగా పేరొందిన ఆధ్మాత్మికవేత్త సాధ్వీ రితంభరలు పద్మభూషణ్ స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాహిత్యం, విద్యారంగాల నుంచి కెఎల్ కృష్ణ (KL Krishna) , వాచస్పతి వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, తెలంగాణ నుంచి ప్రజావ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.