Droupadi Murmu : ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చెస్ ప్లేయర్ డి.గుకేశ్, హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), షూటింగ్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ (Manu Bhaker) ఈ అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు జివాంజీ దీప్తి (పారా అథ్లెటిక్స్), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్) పురస్కారాలను స్వీకరించారు. వీరితో పాటు మరో 32 మంది అర్జున (Arjuna), ఐదుగురు ద్రోణాచార్య (Dronacharya) పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైం కేటగిరీలో మురళీధర్ ( బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) పురస్కారాలు స్వీకరించారు.