ప్రవాసీ భారతీయ బీమా పథకాన్ని.. సహజ మరణాలకూ వర్తింపజేయాలి

విదేశాల్లో పని చేస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధి బృందం కోరింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తున్న ప్రవాసీయుల కోసం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తున్నా. దీనివల్ల ఎవరికీ పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని బ్రహెయిన్‌లోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడు, ప్రవాసీ బీజేపీ నాయకుడు గవ్వలపల్లి వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరింది. ఈ మేరకు అంకాపూర్ రాజరెడ్డి ( బహ్రెయిన్), పండరీ ( సౌదీ)లతో పాటు గల్ఫ్ నుంచి తిరిగి వెళ్లిన వీరేంద్ర కుమార్, రాజేశ్వర్‌లు కేంద్రమంత్రితో సమావేశమై వినతిపత్రం సమర్పించారు.