Modi-kejriwal: హస్తిన నీదా..? నాదా సై..? పోస్టర్ వార్ లో బీజేపీ, ఆప్…

ప్రధాని మోడీ(Modi), హోంమంత్రి అమిత్ షా ద్వయానికి దేశంలో తిరుగులేదు. ఎక్కడ విపక్షపార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. వాటిని ఏదో విధంగా పడేయడమో.. ఎన్నికల్లో ఓడించడమో చేసి తమ పార్టీని అధికారంలోకి తేవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. కానీ.. వారికి పంటికింద రాయిలా మారింది కేజ్రీవాల్. ఆప్ పార్టీని పెట్టడమే కాదు.. వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు కేజ్రీవాల్. అంతేకాదు.. మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలనే థ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా ఆప్(AAP) ను ఓడించాలన్న థ్యేయంతో ఈ అపర చాణక్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాము చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూనే.. బీజేపీ(BJP) , కాంగ్రెస్(CONGRESS) ల అసమర్థతను ప్రజల్లోకితీసుకెళ్తున్నారు కేజ్రీవాల్. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఆప్ ను గద్దెదించడమే థ్యేయంగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమకు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కేజ్రీవాల్.. కమలదళానికి ముకుతాడు వేసేలా వ్యూహాలు కూడా రచించారు.వాటిని కచ్చితంగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఓవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు.తాము గద్దెదిగితే.. ఇవన్నీ ఆగిపోతాయన్న అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు కేజ్రీవాల్.
ఇక .. బీజేపీ అయితే కేజ్రీవాల్(kejriwal) అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రంగా సంధిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్(liquor scam) సూత్రధారి, కింగ్ పిన్ కేజ్రీవాల్ అని గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఇది తమకు కచ్చితంగా కలిసివస్తుందని ఆశిస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారాన్ని పరుగులెట్టిస్తోంది. దీనికి తోడు ప్రధాని మోడీ సైతం ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. తాము అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని గుర్తు చేస్తున్నారు. ఈపరిణామాలు సైతం బీజేపీ కార్యకర్తల్లో అధికారంపై ఆశలు కల్పిస్తున్నాయి.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. 2015 నుంచి రెండుసార్లు గెలుపొందిన ఆప్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీలోనూ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆశిస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా బరిలోకి దిగుతున్నాయి