Narendra Modi : ప్రధాని అందుకే ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి (RSS headquarters) వెళ్లని ప్రధాని ఇప్పుడు వెళ్లడం వెనక ముఖ్యమైన కారణం ఉండొచ్చని అన్నారు. ఆయన పదవీవిరమణ చేయాలని యోచిస్తున్నారని, తన రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat ) తో చర్చలు జరపడానికే అక్కడికి వెళ్లి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.