India America : సరికొత్త శిఖరాలకు భారత్, అమెరికా బంధం

భారత్, అమెరికా (India, America) విస్తృత అంతర్జాతీయ వ్యూహాత్మక బంధం సరికొత్త శిఖరాలను చేరుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వెల్లడిరచారు. టెక్నాలజీ, రక్షణ, అంతరిక్ష, బయో టెక్నాలజీ, కృత్రిమ మేధ రంగాల్లో అది మరింతగా ముందుకు సాగిందని తెలిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ (Jake Sullivan) ఢల్లీిలో ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం మోదీ స్పందిచారు. రెండు దేశాల ప్రజలు, ప్రపంచం మంచి కోసం ఇదే ఒరవడిని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.