ప్రధాని మోదీతో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీ

ఐఫోన్లను కాంట్రాక్టుపై తయారు చేసే ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో కంపెనీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రధానికి ఆయన వివరించారు. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో సమావేశం అద్భుతంగా జరిగింది. భవిష్యత్తులో వృద్ధికి అవకాశమున్న రంగాల్లో, భారత్ అందిస్తున్న అద్భుత అవకాశాలను నేను ప్రత్యేకంగా వారితో ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వారి పెట్టుబడుల ప్రణాళికపైనా చర్చించామని ప్రధాని మోదీ తెలియజేశారు. ఈ ఏడాది జులైలో దేశంలోని మూడో అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్‌ను లియూ అందుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ఫాక్స్‌కాన్ సంస్థలో సుమారు 40,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ మొత్తం పెట్టుబడి విలువ 9-10 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.75,000-83,00 కోట్లు) ఉంది.