కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు

భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులలో ప్రధాని ముచ్చటించారు.