వయనాడ్‌లో ప్రధాని మోదీ… బాధితులకు పరామర్శ

ప్రకృతి విలయంతో తల్లడిల్లిన వయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, అక్కడి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు ఉన్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.