సెప్టెంబరు తొలి వారంలో బ్రూనై, సింగపూర్‌లకు మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు తొలి వారంలో బ్రూనై, సింగపూర్‌లలో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 3-4 తేదీల్లో బ్రూనైలో మోదీ పర్యటిస్తారని పేర్కొన్నారు. భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన కోసం ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుందని తెలిపారు. భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 40 ఏళ్లవుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 4-5 తేదీల్లో మోదీ సింగపూర్‌లో పర్యటిస్తారని తెలియజేశారు.