మరో అరుదైన ఘనత సాధించబోతున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు. స్వాతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. తద్వారా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు.