Modi : మోదీకి అమెరికా సింగర్ ప్రశంసలు

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆఫ్రికా-అమెరికా సింగర్, నటి మేరీ మిల్బన్ (Mary Millben) పొగడ్తల్లో ముంచెత్తారు. ఓ కార్యక్రమంలో మోడీ జీసస్ క్రీస్ట్‌ను పార్థించడాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసించారు. మోదీకి క్రిస్మస్ (Christmas) పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. క్యాథలిక్ చర్చి హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మోదీ పాల్గొనడంపై మేరీ మిల్బన్ స్పందించారు. మీకు శుభాకాంక్షలు. జీసస్ క్రీస్ట్ ఒక గొప్ప బహుమతి, ప్రేమకు ఉదాహరణ. ఇండియన్ బిషప్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మీరు బహిరంగంగా నా రక్షకుడు క్రీస్తును ప్రార్థించినందుకు కృతజ్ఞతలు. వేడుకల్లో మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. భారత్ (India) లోని సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని మిల్బన్ పేర్కొన్నారు.