PM MODI :ఎన్నారైల కోసం ప్రత్యేక టూరిస్ట్ రైలు : ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రవాసీ భారతీయ దివస్ (Pravasi Bharatiya Divas )సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. తర్వాత ప్రవాసీ భారతీయ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్ (Tourist Express) కు ఆయన పచ్చజెండా ఊపి రిమోట్‌గా ప్రారంభించారు. తరువాత ఎన్‌ఆర్‌ఐ (NRI)లను ఉద్దేశించి, ప్రధాని మోదీ ఇలా అన్నారు. మిత్రులారా, మేము మీ సౌలభ్యం, సౌకర్యానికి చాలా ప్రాముఖ్యతనిస్తాము. మీ భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత. మన విదేశీ భారతీయులు ఎక్కడ ఉన్నా, సంక్షోభ సమయాల్లో వారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఇదీ కూడా ఒకటని పేర్కొన్నారు.