ప్రధాని మోదీ అరుదైన రికార్డు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు. ఈ రోజు ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు మాట్లాడారు. 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంచేశారు. ఇది ఆయనకు 11వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం.