నా తలవంచి వారికి క్షమాపణలు చెప్తున్నా : మోదీ

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను అని వెల్లడిరచారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు అని మోదీ మాట్లాడారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.