పారిస్ ఒలింపిక్స్ విజేతలతో… ప్రధాని మోదీ భేటీ

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి షూటర్ మను భాకర్, సరోజ్జోత్ సింగ్, పురుషుల హాకి జట్టు సహా ఒలింపిక్స్ పతక విజేతలు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం వారంతా నేరుగా ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ భేటీ సందర్భంగా భారత పురుషుల హాకీ జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతి అందజేసింది. ఆటగాళ్లంతా సంతకం చేసిన జెర్సీని గుర్తుగా అందజేసింది.