కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిన యామినీ కృష్ణమూర్తి : మోదీ

భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిని డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) మరణం తననెంతో బాధించిందని, భారతీయ శాస్త్రీయ నృత్యానికి అందించిన సేవల ద్వారా కొన్ని తరాలకు ఆమె స్ఫూర్తినిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. యామినీ తన అంకితభావంతో భారతీయ సాంస్కృతిక యవనికపై చెరగని ముద్ర వేశారని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మన వారసత్వాన్ని సుసంపన్నం చేయడానికి ఆమె కృషి చేశారని పేర్కొన్నారు.