కేంద్రం గుడ్‌న్యూస్ … దేశంలో ఎక్కడి నుంచైనా

ఈపీఎస్ పింఛన్‌దారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ మన్‌సుఖ్ మాండవీయ వెల్లడిరచారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుందని తెలిపారు. ఈపీఎఫ్‌ఓ ఆధునికీకరణలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ కీలక మైలురాయిని అని మాండవీయ పేర్కొన్నారు. పింఛన్‌దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు దీంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దీనివల్ల పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచైనా పింఛన్ పొందే వీలుంటుందన్నారు. పింఛన్‌దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ఏదైనా బ్యాంక్ లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడనుంది.