Passport :పాస్‌పోర్టు నిబంధన సరళతరం

పాస్‌పోర్టు (Passport) దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(Marriage registration certificate) తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను సరళీకృతం చేస్తూ భారత విదేశీ మంత్రిత్వ శాఖ విధానపర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పాస్‌పోర్టు సేవ వెబ్ సైట్ (Website )లో కూడా మార్పులను జోడిరచారు. దీని ప్రకారం అనుబంధం జే ను పాస్‌పోర్టు దరఖాస్తుదారు పూరించాల్సి ఉంటుంది. దానిపై దంపతులు ఇద్దరు తేదీ, స్థలం పేర్కొంటూ సంతకం చేయాలి. వివాహం అయిందని, కలిసి ఉంటున్నామని నిర్ధారించాలి. తాము నివసిస్తున్న చిరునామాను పేర్కొనాలి. కలిసి దిగిన ఫొటోను స్వీయ నిర్థారణ చేసి జత చేయాలి. ఇరువురి ఆధార్(Aadhaar) లేదా ఓటర్ ఐడీ (, Voter ID) లేదా పాస్ పోర్టు నంబరును పేర్కొనాలి. దీనివలన పెళ్లి సర్టిపికెట్ లేకపోయినా జీవిత భాగస్వామి పేరును జత చేసుకొని సులభంగా పాస్‌పోర్టు పొందవచ్చు.