Rekha Gupta : ఢిల్లీ మహిళలకు శుభవార్త.. త్వరలోనే

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta ) పేర్కొన్నారు. ఇందులో భాగంగా అర్హులైన మహిళల (Women’s) కు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హమీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ లో పేద మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశాం అని రేఖ గుప్తా పేర్కొన్నారు. ఇందులో అశీష్ సూద్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు (Ministers) కూడా ఉన్నారని చెప్పారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్ (Webportal)ను అందుబాటులోకి తెస్తామన్నారు.