ప్రముఖ న్యాయకోవిదుడు ఏజీ నూరానీ ఇకలేరు

ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీ (94) ముంబయిలోని తన నివాసంలో కన్ను మూశారు. నూరానీ పూర్తి పేరు అబ్దుల్ గపూర్ మజీద్ నూరానీ, 1930 సెప్టెంబరు 16న ముంబయిలో జన్మించారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన నూరానీ బొంబాయి హైకోర్టు, సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేశారు. రచయితగా, రాజకీయ వ్యాఖ్యాతగా చాలా పేరు సంపాదించుకున్నారు. దేశంలోని ప్రముఖ పత్రికలకు వ్యాసాలు రాశారు. రాజ్యాంగ అంశాలపై చేసిన విశ్లేషణలు ఆయనకు ఎక్కువ పేరు తెచ్చాయి. పలు పుస్తకాలను రచించారు. అందులో ప్రముఖమైనవి ద కశ్మీర్ డిస్ప్యూట్ 1947`2012, ఆర్టికల్ 370, ఏ కానిస్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్. కశ్మీర్ నిపుణుడిగా నూరానీకి పేరుంది.