Mamata Banerjee :ఈ కేసు పోలీసుల చేతుల్లో ఉంటే.. మరణశిక్ష : మమతా

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యచారం కేసులో దోషి సంజయ్ రాయ్ (Sanjay Roy )కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. ఈ తీర్పుపై తాను సంతృప్తి చెందలేదని అన్నారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో దోషికి మరణశిక్ష విధించాలని మేమంతా డిమాండ్ చేశాం. కానీ, అలా జరగలేదు. ఈ కేసును బెంగాల్ పోలీసుల (Police )నుంచి బలవంతంగా సీబీఐ (CBI)కి బదిలీ చేశారు. ఒకవేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారు. అసలు విచారణ ఎలా జరిగిందో తెలియదు. రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడిరది. ప్రస్తుత తీర్పు సంతృప్తికరంగా లేదు అని మమతా పేర్కొన్నారు.