సెప్టెంబర్ 15 వరకు… పద్మ అవార్డుల నామినేషన్ లు

2022 పద్మ అవార్డుల నామినేషన్ లను సెప్టెంబర్ 15 వరకు స్వీకరించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్‍లైన్‍లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954లో పద్మ అవార్డులను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి.