NASA :భారత విద్యార్థికి అరుదైన అవకాశం ఇచ్చిన నాసా

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన విద్యార్థి దక్ష్ మాలిక్ (Daksh Malik) (14) అరుదైన ఘనతను సాధించాడు. తాను కొనుగొన్న గ్రహశకలానికి (Asteroid) తనే పేరు పెట్టే అవకాశాన్ని నేషనల్ ఏరోనాటిక్‌స అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) (NASA) అతడికి ఇచ్చింది. నాసాతో భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్టు కింద 2023లో దక్ష్ మలిక్ తన స్నేహితులతో కలిసి ఓ గ్రహశకలాన్ని గుర్తించాడు.
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ కింద దక్ష్ తన ఇద్దరు స్నేహితులకు 2022లో గ్రహశకలాన్ని కనుగొనేందుకు అవకాశం లభించింది. వారి స్కూల్‌కు చెందిన ఆస్ట్రోనమీ క్లబ్ నాసా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమికల్ సెర్బ్ కొలాబరేషన్ కు మెయిల్ (Mail) పంపడంతో వారికి ఈ అవకాశం లభించింది. దీంతో ఏడాదిన్నరపాటు అంతరిక్షాన్ని శోధించి 2023లో ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. నాటి నుంచి దాని పేరు 2023 ఓజీ40గా కొనసాగుతోంది. ప్రస్తుతం దానికి శాశ్వత పేరును పెట్టే అవకాశాన్ని నాసా కల్పించింది.