Sukanta Majumdar: ఎన్‌ఈపీలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దడం లేదు: సుకాంత మజుందార్

జాతీయ విద్యా విధానంలోని (NEP) త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు – కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాజ్యసభలో మరోసారి చర్చ జరిగింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ (Sukanta Majumdar) మాట్లాడుతూ.. ఎన్‌ఈపీలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషను బలవంతంగా రుద్దడంలేదని స్పష్టం చేశారు. ‘‘ఎన్‌ఈపీలో (NEP) భాగంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన మూడు భాషలను ఆయా రాష్ట్రాలు లేదా విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. రాష్ట్రాలపై ఒక భాషను రుద్దడమనే అంశమే ఎన్‌ఈపీలో లేదు. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు ఉండాలని మాత్రమే నిబంధనలో ఉంది. రాజ్యాంగ పరంగా రాష్ట్రాల అనుమతితోనే ఎన్‌ఈపీ అమలు జరుగుతోంది. త్రిభాషా సూత్రం ఉద్దేశం బహుభాషా విధానాన్ని ప్రోత్సాహమే. ఏ భాషకూ ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఎన్‌ఈపీకి లేదు,’’ అని మంత్రి (Sukanta Majumdar) స్పష్టంచేశారు.