Nitin Gadkari: శివాజీ గొప్ప సెక్యులర్ పాలకుడు: నితిన్ గడ్కరీ

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను 100% సెక్యులర్ పాలకుడిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభివర్ణించారు. ఆయన ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించినప్పటికీ, ఒక్క మసీదును కూడా ధ్వంసం చేయలేదలన్నారు. ఢిల్లీలో విశ్వాస్ పాటిల్ రాసిన *ది వైల్డ్ వార్‌ఫ్రంట్* ఆంగ్ల అనువాదాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ.. మహారాష్ట్ర వెలుపల శివాజీ మహారాజ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయని, నిజానికి ఆయన ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా, శక్తిమంతమైన నాయకుడిగా నిలిచారని వివరించారు. “శివాజీ మహారాజ్ నిజమైన రాజధర్మాన్ని పాటించిన గొప్ప పాలకుడు. కుల, మత భేదాలను అతిక్రమించి ప్రజల సంక్షేమాన్ని ముందుంచారు. కులం, మతం గురించి మాట్లాడటాన్ని ప్రోత్సహించడం కరాఖండిగా తప్పు. రాజకీయ నేతలు ఎవరూ ఇలాంటి విషయాలపై రాజకీయం చేయకూడదు,” అని గడ్కరీ అన్నారు. శివాజీ మహారాజ్ పాలనలో ధర్మం, న్యాయం ప్రధానంగా నిలిచాయని, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసే వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు.