దేశంలోనే ఐఐటీ మద్రాస్ అగ్రస్థానం.. వరుసగా ఆరో ఏడాది

దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో ఐఐటీ మద్రాస్ మరోసారి ది బెస్ట్ అనిపించుకుంది. అత్యుత్తమ విద్యాసంస్థ (ఓవరాల్)గా వరుసగా ఆరో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఇక, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ ఇన్‌స్యిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్‌ఐఆర్‌ఎఫ్) కింద రూపొందించిన ఈ జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విడుదల చేశారు. యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్ ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులను ప్రకటించారు. విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది.