ప్రధాని మోదీని కలిసిన ఎన్‌బీడీఏ ప్రతినిధులు

దేశంలో ప్రసార మాధ్యమ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను న్యూస్‌బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్‌బీడీఏ అధ్యక్షుడు రజత్ శర్మ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు ప్రధాని మోదీని కలిసి డిజిటల్ మీడియా విస్తరిస్తున్న క్రమంలో ప్రసార మాధ్యమ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను, ప్రతిబంధకాలను తెలియజేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ విమిటెడ్ డైరెక్టర్ ఐ.వెంకట్, న్యూస్ 24 బ్రాడ్‌కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైరపర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాధా ప్రసాద్ శుక్లా, సన్‌టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ ఎండీ ఆర్.మహేశ్ కుమార్ తదితరులు ప్రధాని మోదీని కలిసిన వారిలో ఉన్నారు.