Amit Shah : 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్ షా

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh ) అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల్లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ (Naxals) ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరకు పరిమితమైనట్లు పేర్కొన్నారు. దీంతో మనం మరో మైలు రాయిని చేరుకున్నామన్నారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా పెకిలించివేస్తామని పునరుద్ఘాటించారు.