మళ్లీ అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముకేష్ అంబానీ ముందుకొచ్చారు. గడిచిన 14 ఏళ్లుగా ఆసియాలో అత్యధిక సంపద కలిగిన అంబానీని మంగళవారం అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వెనక్కి నెట్టారు. ఒక్క పుటలోనే తిరిగి ఈ స్థానాన్ని అంబాన్నీ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నాటి బ్లూమ్బర్గ్ గణాంకాల ప్రకారం ముకేష్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్ల (రూ.6.69 లక్షల కోట్లు)కు పెరగడంతో తొలి స్థానంలోకి వచ్చారు. అదానీ సంపద 86.3 బిలియన్ డాలర్లు (రూ.6.47 లక్షల కోట్లుగా) ఉంది. దీంతో వీరిద్దరు ప్రపంచ కుబేరుల్లో వరుసగా 10, 11వ స్థానాల్లో ఉన్నారు. బుధవారం సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 1.19 శాతం పెరిగి రూ.2,384కు చేరడంతో ముకేష్ మళ్లీ అగ్రస్థానంలోకి వచ్చారు.






