మిసెస్ సౌత్ ఇండియా గా వర్షారెడ్డి

మిసెస్ సౌత్ ఇండియా-2024 కిరీటం హైదరాబాద్‌కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో ఆమె టైటిల్ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ నుంచి టైటిల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మిస్ సౌత్ ఇండియా`2012 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన తాను మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని తెలిపారు. కాగా, వర్షారెడ్డి హైదరాబాద్‌లోని పలు ఐటీ కన్సల్టింగ్ డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, సినిమా ప్రొడక్షన్ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.