సీజేఐ ఇంట గణపతి పూజలో ప్రధాని మోదీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహించాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. తమ నివాసానికి విచ్చేసిన ప్రధానికి జస్టిస్ చంద్రచూడ్, కల్పనాదాస్ దంపతులు సాదర స్వాగతం పలికారు.