బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు

మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిహాడ్ జైలు నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్టయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు. ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.