MK Stalin : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి (R.N.Ravi )తో విభేదాల వేళ రాష్ట్ర స్వయంప్రతిపత్తి పై సూచనలకు కమిటీని ఏర్పాటు చేసింది. స్వయంప్రతిపతి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేయనుంది. బిల్లుల ఆమోదంపై గవర్నర్, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుతో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పెండిరగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం సృష్టం చేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్దమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిటల్ (Gazette) విడుదల చేసింది. ఈ పరిణామాల వేళ తాజా నిర్ణయం వెలువడిరది.