కేంద్రం కీలక నిర్ణయం.. లద్దాక్‌లో కొత్తగా

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్‌లో లేప్‌ా, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్‌స్కర్, ద్రాస్, షామ్, సుబ్రా, చాంగ్‌థాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు మెరుగైన పాలనకు ఇదో ముందడుగు అని తాజా నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు అభినందనలు తెలియజేశారు.