బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మరోసారి మాయావతి ఏకగ్రీవంగా ఎన్నిక

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు గా మరోసారి మాయావతి ఎన్నికయ్యారు. బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్‌లు, రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కలిసి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాయావతి వైదొలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసిన మరుసటి రోజే ఆమెను మళ్లీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం గమనార్హం.