మైక్ కట్.. నీతి ఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి మాట్లాడటం ప్రారంభించగానే తన మైక్ ఆప్ చేశారని ఆరోపిస్తూ ఆమె సమావేశం నుంచి బయటకు వచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో పశ్చిమబెంగాల్‌పై వివక్ష చూపారని, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ మాట్లాడటం ప్రారంభించగానే వారు నా మైక్ ఆపేశారు. నేను మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఎందుకు వివక్ష చూపుతున్నారని నేను ప్రశ్నించాను. విపక్షాల నుంచి హాజరైంది నేను ఒక్కదాన్నే. నన్నొక్కదాన్ని కూడా వారు ఆపారు. మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు నాకు తగిన సమయం ఇవ్వకపోవడం అవమానించడమే అని మమత ఆరోపించారు.ఈ చర్య అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందికే వస్తుందని విమర్శించారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని అన్నారు.