Mahakumbh Mela :మహాకుంభమేళాలో ఇప్పటివరకు .. 10 కోట్లకు పైగా భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Mahakumbh Mela )తో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కళకళాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమం (Triveni Sangam )లో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడిరచింది. గురువారం మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపింది.