భారత సైన్యం నూతన సారథిగా… ఉపేంద్ర ద్వివేది

భారత సైన్యం నూతన సారథిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎంపికయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నారు. జూన్ 30న మధ్యాహ్నం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ సి.పాండే అదే రోజు ఉదయం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన మే 31నే రిటైరవాల్సి ఉండగా అసాధారణ రీతిలో నెల పాటు పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది.