అంబానీ ఇంట పెళ్లిలో కోనసీమ ఘణపాఠీ లు వేద ఆశీర్వచనం

అంగరంగ వైభవంగా జరిగిన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో కోనసీమ వేద పండితులు తమ వేద ఆశీర్వచనాలు అందించారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహ వేడుకలు ఐదు రోజులు పాటు ఘణపాఠీ లు పాల్గొని తమ వేద ఆశీర్వచనం అందించారు. వీరిలో నందంపూడి గ్రామానికి చెందిన కర్ర విశ్వనాథ ఘణపాఠీ పాసర్లపూడి లంక గంటి భార్గవ్ ఘణపాఠీ, ఇందుపల్లి కి చెందిన గొర్తి సాంబశివ ఘణపాఠీ, కమలేష్ ఘణపాఠీ లు పాల్గొన్నారు.