సుప్రీంకోర్టు మరో అరుదైన సందర్భానికి… వేదికైంది

దేశ అత్యున్నత న్యాయస్థానం మరో అరుదైన సందర్భానికి వేదికైంది. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తుండటమే అందుకు కారణం. సాయంత్రం 4:15 గంటల ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్ ఆ సినిమాను వీక్షించేందుకు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమిర్ వస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సరదగా మాట్లాడారు. కోర్టులో తొక్కిసలాట తరహా పరిస్థితిని నేను కోరుకోను. కానీ ఈ రోజు ఇక్కడ అమిర్ ఉన్నారు అంటూ చమత్కరించారు. ఈ సినిమాను సీజేఐ, ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, ఇతర సిబ్బంది వీక్షించారు. తన చిత్రాలతో సామాజిక అంశాలను లేవనెత్తే ఆమిర్ సొంత బ్యానర్‌పై లాపతా లేడీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.