అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం .. మరోసారి బెదిరింపులు

సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం అంటూ హెచ్చరించారు. ఈ వీడియో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను కూడా పన్నూన్ హెచ్చరించారు.