Kejriwal ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి : కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోన్న తరుణంలో ఆప్, బీజేపీ ఒకదానిపై ఒకటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తనకు ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ (BJP) సీఎం అభ్యర్థి రమేశ్ బిధూడీ (Ramesh Bidhudi ) అని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. మాకున్న సమచారం మేరకు రమేశ్ బిధూడినే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో దీనిపై ప్రకటన రానుంది. సీఎం అభ్యర్థి అవుతున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు. దేశ రాజధాని విషయంలో ఆయన విజన్ ఏంటో చెప్పాలి. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఢిల్లీ అభివృద్ధి, ఇతర అంశాలపై సీఎం అభ్యర్థులు చర్చల్లో పాల్గొనాలి అని కమలం పార్టీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.