Ranya Rao : నటి రన్యా రావుకు కోర్టులో షాక్

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం (Gold) తీసుకొస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కు కోర్టులో షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న తరుణ్ (Tarun) బెయిల్ పటిషన్ దాఖలు చేయగా, దీనిపై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించనుంది.
మరోవైపు రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించగా, ఆమె కీలక విషయాలను వెల్లడిరచినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ వీడియోలు (YouTube videos) చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసులో కొందరు వ్యక్తులు సిండికేట్‌లా ఏర్పడి స్మగ్లింగ్ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) చేసిన ఫిర్యాదుతో సీబీఐ (CBI) రంగంలో దిగింది.